7tv focus : తాజాగా మంథని పట్టణంలోని రావుల చెరువు కట్ట హనుమాన్ ఆలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ విషయం తెలిపారు. రాజశేఖర్రెడ్డి హయాంలోనే భట్టి విక్రమార్క సింగరేణి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వారి పట్టాలను క్రమబద్ధీకరించారని ఆయన గుర్తు చేశారు. అయితే ఇంకా మిగిలి ఉన్నవారికి సంబంధించి కమిటీ ఏర్పాటు చేసి పట్టాలు అందించేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. స్థానికులు చాలా కాలంగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారి కష్టాలను గుర్తించి పరిష్కారం వైపు అడుగులు వేస్తోందని ఆయన సూచించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ ఇల్లు ఉండాలని ఇందిరమ్మ ఇళ్ళ పథకం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇళ్ళ పట్టాలు లేకున్నా సింగరేణి భూముల్లో చాలా కాలంగా ఉంటున్న వారికి పట్టాలు ఇచ్చి శాశ్వత నివాసాన్ని కల్పిస్తామని చెప్పారు. మంథని ప్రాంతంలో జరిగిన గణేశ పూజలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై కూడా దృష్టి సారించారు. సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న కుటుంబాలకు భూమి హక్కులు కల్పించడం ద్వారా వారి జీవనోపాధికి భద్రత కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అని ఆయన అన్నారు.

