7tv focus : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు మరో నెల రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత నియోజకవర్గంలో జెన్ జీని ఎన్నికల బరిలో దింపనున్నారు. నెల్లూరు రూరల్ లో మొత్తం 36 డివిజన్లు ఉండగా.. వీటిల్లో నాలుగింటిని కేటాయించాలని నిర్ణయించారు. ఆయా డివిజన్లల్లో జెన్ జీ అభ్యర్థుల వడపోత సైతం చేపట్టారు. నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజల కోసం పని చేయాలన్న తపన, రాజకీయాలపై ఆసక్తి, ప్రజా సమస్యలపై అవగాహన, వాటిని పరిష్కరించడానికి అవసరమైన అవసరమైన వ్యూహాలు, కష్టపడి పనిచేసే మనస్తత్వం, అనర్గళంగా మాట్లాడే జెన్ జీ యువతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. డివిజన్ స్థాయి నుంచే రాజకీయాల్లో అవకాశాలను కల్పించడం ద్వారా జెన్ జీ యువత మున్ముందు మరిన్ని అద్భుతాలను సృష్టించగలదని విశ్వసిస్తోన్నారు కోటంరెడ్డి. Also Read కంప్లీట్ కంట్రోల్ సాధించిన వ్లాదిమిర్ పుతిన్.. !! యువతరంలో చురుగ్గా రాజకీయ సమీకరణాల్లో అన్ని అర్హతలు ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేయనున్నారు. ఈ నాలుగు డివిజన్లల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చు, ఇతరత్రా వ్యయాలను ఆయనే స్వయంగా భరించనున్నారు కూడా. వారికి అవసరమైన ప్రచార సామాగ్రిని కూడా సొంత ఖర్చులతో సమకూర్చుతారని తెలుస్తోంది. రాజకీయాల్లో జెన్ జీ యువతను ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే కోటంరెడ్డి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

