భగత్సింగ్ కోరుకున్న స్వాతంత్ర్యం కేవలం బ్రిటిష్ పాలన నుంచి అధికార బదిలీ కాదని, దోపిడీ, అసమానతలకు ముగింపు పలికి సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక, ప్రజాస్వామ్య న్యాయంపై ఆధారపడిన సమాజ నిర్మాణం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారని, ఆ సమాజం కోసం నేటి యువత, విద్యార్థులు పాటుపడాలని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలభిందెల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
భారతదేశస్వాతంత్ర్య సమరయోధులు షహీద్ భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా ఏఐటీయూసీ నిజాంపేట్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులు, ఓటుహక్కు పరిరక్షణ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో తప్పిదాలపై సమగ్ర విచారణ జరపి ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, అరెస్ట్ చేయాలని డిమాండ్, ప్రగతి నగర్ పీకాక్, సర్కిల్ వద్ద నినాదాలు చేస్తూ భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఓటుహక్కు పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
ఈ సందర్బంగా ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలభిందెల శ్రీనివాస్. మాట్లాడుతూ భగత్సింగ్ నాడు దేశ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేస్తే... నేడు అదే ప్రజాస్వామ్య వ్యవస్థకు , రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గుప్తా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నేడు ఓటర్ల జాబితా ప్రజాస్వామ్య హక్కులలో కీలకమైన భాగమని, అందువల్ల సర్ ప్రక్రియలో ఒక్క అర్హుడి ఓటు కూడా అన్యాయంగా తొలగిపోకుండా పూర్తి పారదర్శకత ఉండాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని అన్నారు. సర్ లో నమోదైన తప్పిదాలు, నోటీసుల ప్రక్రియ, ఓటర్లకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఎన్నికల సంఘం పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా జ్ఞానేశ్ కుమార్ గుప్తా నేతృత్వంలోని ఎన్నికల సంఘం ఈ అంశాలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని, బాధ్యతారాహిత్యం లేదా చట్టవిరుద్ధ చర్యలు ఏవైనా విచారణలో నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అందుకే ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను రాజీనామా చేయాలని, ఆలాగే అరెస్ట్ చేయాలని ప్రజాస్వామ్య వాదులుగా కోరుతున్నామన్నారు జ్ఞానేష్ ను తక్షణమే పదవి నుండి తొలగించాలని లేకుంటే దేశవ్యాప్తంగా ప్రజలు కార్మికులు యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శి మేకల బాల కృష్ణ, ఆశి. యాదయ్య, కన్వీనర్ పొన్నకంటి. దస్తగిరి, నర్సింహా, సురేష్, రాజు,కె. మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

