కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరో ముందడుగు పడింది. CMC నిధుల ద్వారా ₹1కోటి .80 లక్షల వ్యయంతో సర్దార్జీ బస్తీ (గణేష్ ఆలయం) నుండి మహాదేవ్పూర్ వరకు చేపట్టనున్న CC రోడ్డు అభివృద్ధి పనులకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.స్థానిక ప్రజలకు మెరుగైన రహదారి, రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు, ప్రాంతంలో మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ రోడ్డు పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్, డీసీసీ సెక్రటరీ గణేష్, లాయక్, డిస్ట్రిక్ట్ మైనారిటీ జనరల్ సెక్రటరీ షఫీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎండి నయీమ్, గంట శివ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.అలాగే మహాదేవపురం వెల్ఫేర్ సొసైటీ కమిటీ సభ్యులు కె. వెంకట్ రెడ్డి, డి. జగదేశ్వర్ రెడ్డి, ఎం. రంగారావు, డి. ప్రసాద్ బాబు, పి. రాంచంద్రారెడ్డి, ఆర్. ప్రవీణ్ కుమార్, ఇ. ప్రభాకర్ రెడ్డి, పి. వెంకట్ రెడ్డి, బి. నరేంద్ర రెడ్డి, పి. రామకృష్ణా రెడ్డి, ఎస్. యాదగిరి, డి. మహేశ్వర్ రెడ్డి, కె. నవీన్ రావు, డి. మల్లా రెడ్డి, టి. రంజిత్, ఎ. మల్లా రెడ్డి, జి. దేవేందర్ రెడ్డి, వి. వెంకట్ రెడ్డి, జె. మధుసూధన్ రెడ్డి, ఎం. శ్రీనివాస రెడ్డి, పి. శ్రీనివాస రావు, ఎ. దిలీప్ కుమార్ పాల్గొన్నారు.ప్రజల కోసం – అభివృద్ధి కోసం – కుత్బుల్లాపూర్ ప్రగతి కోసం.

