7tv focus : కాకతీయ యూనివర్సిటీలో నాన్ బోర్డర్లు హల్చల్ చేస్తున్నారు. హాస్టళ్లు, మెస్‌లలో తిష్ఠవేసి బోర్డర్లను అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వర్సిటీ హాస్టళ్లలో ఎలాంటి అనుమతి లేకుండా ఉంటూ లైబ్రరీలో చదువుకుంటున్నామని చెబుతున్నారు. కానీ తమకు ఇష్టమైన వ్యాపకాల్లో మునిగి తేలుతున్నారు. హాస్టల్ సౌకర్యాలను అనుభవిస్తూ మెస్‌లోకి చొరబడి హాస్టల్ సిబ్బందిని బెదిరించి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదేమని అడిగితే భౌతికదాడులకు దిగుతున్నారు. కామన్ మెస్, న్యూ పీజీ హాస్టల్‌తో పాటు ప్రతాపరుద్ర, జీడీ-1, జీడీ-2లతో పాటు అన్ని హాస్టళ్లలోనూ నాన్ బోర్డర్లు అక్రమంగా ఉంటున్నారు.
గతంలో బోర్డర్.. తాజాగా నాన్ బోర్డర్
కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో 29కోర్సులున్నాయి. ఏటేటా వేలమంది విద్యా ర్థులు పోటీ పరీక్షలు రాసి పీజీతో పాటు ఇతర కోర్సుల్లో అడ్మిషన్లు సాధింటున్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్‌షిష్‌లు, పీజు రీయింబర్స్మెంట్లు చెల్లిస్తోంది. వర్సిటీ హాస్టల్ అధికారులు విద్యార్థులకు హాస్టల్, మెస్ వసతులు కల్పిస్తారు. అయితే కొందరు విద్యార్థులు మొదటి పీజీ తర్వాత మళ్లీ మరో కోర్సులో అడ్మిషన్లు పొందుతారు.ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కో విద్యార్థికి పీజీ కోర్సుల్లో ఒకేదఫా ఫీజులను చెల్లి స్తోంది. మరోపీజీ చదువుకోనే వీలుంటోంది. కానీ ఫీజులను మాత్రం అభ్యర్థి నేరుగా చెల్లించుకోవాలి. దీంతో విద్యార్థులు మెస్, హాస్టల్ తీసుకోరు. నాన్ బోర్డర్లగా రూమ్లలోఉంటూ మెస్‌లో అను మతులులేకుండా ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నా రు. ఇదిలా ఉంటే.. మరి కొందరు ఎలాంటి అడ్మి షన్లు లేకుండనే నాన్బోర్డర్లగా హాస్టళ్లలో అక్ర మంగా ఉంటున్నారు.
హాస్టళ్లు, మెస్‌లో గొడవలు
వర్సిటీ హాస్టల్స్‌లో నాన్‌బోర్డర్ల ఒత్తిడి పెరుగుతోంది. ఒక్కోరూమ్లో బోర్డర్లతోపాటు నాన్ బోర్డర్లు ఉంటుండటంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. నీళ్లు, ఇతర వనరులన్నీంటికీ కొరత ఏర్పడుతోంది. అపరిశుభ్రమైన వాతావరణం నెల కొంటోంది. హాస్టల్ సిబ్బందికి నాన్ బోర్డర్లతో పనిఒత్తిడి పెరుగుతోంది. పరిమితికి మించి విద్యార్థులుం డటంతో మౌలిక వసతులు సరిపో వడంలేదు. వర్సిటీ క్యాంపస్‌లో చదివినంత కాలం బోర్డర్‌గా తాజాగా నాన్‌బోర్డర్ల తిష్ఠవేసి డిష్యుం.. డిష్యుంకు దిగుతున్నారు. దీంతో క్యాంపస్‌లో విద్యా వాతావరణం దెబ్బతిని విద్యార్థుల మధ్య ఐక్యత కొరవడుతోం ది. కలిసిమెలిసి ఉండాల్సిన విద్యార్థులు మాట మాట అనుకుంటూ గ్రూపులుగా విడిపోయి దాడులకు దిగడం నిత్యకృత్యంగా మారుతోంది. వర్సిటీ క్యాంపస్‌లో ఎప్పుడూ ఎలాంటి గొడవ తలెత్తి ఉద్రిక్తంగా మారుతోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల ప్రయత్నాలు విఫలం
క్యాంపస్‌లో నాన్ బోర్డర్ల సమస్య ఇప్పటిది కాదు. అనేక ఏళ్లుగా కొనసాగుతోంది. విద్యార్థుల కు జాబ్‌లు లేక క్యాంపస్‌లో లైబ్రరీలో ఉండి చదువుకుంటున్నారు హాస్టల్ అధికారులు, వర్సిటీ ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవరిస్తు న్నారు. అయితే కొందరు నాన్‌బోర్డర్లు అలుసుగా తీసుకుని ఇష్టారాజ్యంగావ్యవహరిస్తున్నారు. మెస్ లోకి అక్రమంగా చొరబడి సిబ్బందితో దురుసుగా మాట్లాడటమే కాకుండా బెదిరింపులకు దిగుతూ భౌతికదాడులకు పాల్పడుతున్నారు.
సరుకులు దొంగతనం
కొన్నిరోజుల కిందట కేయూ కామన్ మెస్‌లో ఎంసీఏ నాన్ బోర్డర్ విద్యార్థి తప్పతాగి వచ్చి హాస్టల్ మెస్ కమిటీ విద్యార్థులను బెదిరించి సరుకులను ఎత్తుకెళ్లాడు. దీంతో విద్యార్థులు పరస్పర దూషణలు, దాడులకు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరస్పరం గొడవకు దిగి పిడిగుద్దులకు దిగారు. దీంతో విద్యార్థులు తమ విభాగానికి చెందిన విద్యార్థిపై దాడి కి దిగారని.. మరో వర్గం విద్యార్థులు ఏకమై పరస్పర ఘర్షణలు, దాడులకు దిగడంతో వర్సిటీ క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాలకు చెందిన విద్యార్థులు తమను వ్యక్తిగతంగా దూషించారని కేయూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చిన్న ఘర్షణ, గొడవగా మారింది. విద్యార్థులపై దాడులకు దిగిన ఎంసీఏ నాన్ బోర్డర్ విద్యార్థిని పోలీసులు వర్సిటీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సదరు విద్యార్థిని పిలిచి మందలించారు. అధికారులు, పోలీసులు విద్యార్థులను కూర్చోబెట్టి నచ్చచెప్పారు.

