7tv focus : దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రముఖులను విజయవాడ దసరా ఉత్సవాలకు ఆహ్వానిస్తూ నగరానికి మరింత జాతీయ గుర్తింపు తీసుకురావడంపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) ప్రత్యేక దృష్టి సారించారు. అస్సాం ప్రముఖులకు విజయవాడ ఆతిథ్యాన్ని అందించేందుకు చిన్ని ప్రత్యేక ఆహ్వానం పలికారు. ఈరోజు(గురువారం) అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి అశోక్ సింఘాల్, సీఎస్ డాక్టర్ రవి కోటను మర్యాదపూర్వకంగా కలిశారు.ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి అస్సాం ప్రముఖులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ దసరా నవరాత్రి ఉత్సవాలకు రావాల్సిందిగా అస్సాం ప్రముఖులకు ఆహ్వానం పలికారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకోవాలని తెలిపారు. దుర్గమ్మ దర్శనంతో పాటు విజయవాడ నగర సాంస్కృతిక వైభవాన్ని చాటే ‘విజయవాడ ఉత్సవ్’లో పాల్గొనాలని కోరారు.

