7tv focus : టీడీపీ కన్నతల్లిలాంటిది.. వైసీపీ కసాయి పార్టీ వంటిదని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అభివర్ణించారు. నేరస్థులు, గూండాలు మాత్రమే వైసీపీలో ఉంటారని అన్నారు. శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో వైసీపీలోని 20 కుటుంబాలు.. టీడీపీలో చేరాయి. ఆయా కుటుంబాలను పార్టీలోకి ఆహ్వానించి.. వారికి ఆయన కండువాలు కప్పారు. అనంతరం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. గతంలో టీడీపీలో ఉండి.. వైసీపీలోకి వెళ్లిన ఈ కుటుంబాలు తిరిగి సొంత గూటికి చేరడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో నేతలు, కేడర్ రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆ పార్టీలో రాజీనామాల పర్వం మరింత ఊపందుకుంది. అటు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు ప్రతి రోజూ పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. గత వారం రోజుల్లో విజయనగరం జిల్లాలోని పలువురు వైసీపీ జడ్పీటీసీ సభ్యులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం వారాంతా టీడీపీలో చేరారు. జిల్లాలో మరింత మంది ఆ పార్టీని వీడతారని ఈ సందర్భంగా సదరు జడ్పీటీసీలు స్పష్టం చేశారు.అలాగే పల్నాడు జిల్లాలో మాజీ సర్పంచ్తోపాటు దాదాపు 200 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరాయి. హిందూపురం వైసీపీ మాజీ అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ కూడా ఆ పార్టీకి వీడారు. తన రాజీనామా లేఖను శుక్రవారం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు పంపారు. తాజాగా పల్నాడు జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో పలువురు వైసీపీ నేతలు.. టీడీపీలో చేరారు.

