7tv focus : చాలా మందికి కాఫీ అంటే ఇష్టం. కాఫీ లేనిదే రోజు గడవదు. ఉదయం నిద్ర లేస్తేనే కాఫీ తాగి రోజు మొదలుపెడతారు. అలాగే, కాఫీ రుచిని ఆస్వాదించడంతో పాటు కాఫీ తయారు చేయడంలోనూ కొంతమంది ఆసక్తి చూపుతారు. మన ఇండియన్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కూడా కాఫీ ప్రియుడు. కాఫీ ఎంతో ఇష్టంగా సిప్ చేసే అతను తరచూ కాఫీ చేస్తాడు కూడా. కాఫీ చేయడమంటే అతనికి మహా ఇష్టం. సరదా కూడా. జురెల్ ఇటీవలే కాఫీ చేస్తుండగా.. ఆస్ట్రేలియన్ కాఫీ ఆంత్రప్రెన్యూర్ బరిస్తా కిర్క్ పియర్సన్ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. ధ్రువ్ జురెల్ ఓ కాఫీ మెషీన్ పక్కన నిలబడి కాఫీ తయారు చేస్తూ ఆ వీడియోలో కనిపిస్తాడు. మెషీన్ నుంచి కాఫీకి అవసరమైన పదార్థాలు తీసుకోవడం, కాఫీని మరిగించి కప్పులో పోయడం వంటి దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. కాఫీని తయారు చేస్తున్న ప్రతి క్షణాన్ని జురెల్ ఆస్వాదించాడని పియర్సన్ తెలిపాడు.

