7tv focus : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో టీడబ్ల్యూజెఎఫ్ అనుసంధానంగా ఉన్న కేబుల్ యూనియన్కు నూతన కార్యవర్గం ఏర్పాటైంది. కేబుల్ రంగంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు సభ్యుల సంక్షేమం కోసం ఐక్యంగా పనిచేయాలని నూతన కార్యవర్గం నిర్ణయించింది.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో టీడబ్ల్యూజెఎఫ్ జిల్లా నాయకులు, కేబుల్ యూనియన్ సలహాదారులు, పలువురు ప్రముఖులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు.
7 టీవీ ఫోకస్ ఛైర్మన్ మరే చిన్నాబాబు, ప్రజాగళం ఛైర్మన్ దండుపాటి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆదాబ్ సైబరాబాద్ పత్రిక ఎడిటర్ శివ కుమార్ నూతన కార్యవర్గ సభ్యులకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా శ్యామల వెంకటేష్, ఉపాధ్యక్షులుగా ఎం. రమేష్, పర్వేజ్, అక్బర్, జనరల్ సెక్రెటరీగా దుర్గారావు, సెక్రెటరీలుగా అజ్మద్, అలీ, ఫిరోజ్, ట్రెజరర్గా ప్రభు చారి ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి, యూనియన్ సభ్యుల హక్కుల పరిరక్షణకు తమవంతు కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కావలి మోహన్, రమేష్తో పాటు పలువురు కేబుల్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

