7tv focus : అక్రమ సంబంధం వద్దంటూ ఓ కన్న తల్లిని కొడుకు గొంతుకోసి దారుణంగా హత్య చేసిన సంఘటన కాజీపేటపట్టణం బాలాజీనగర్ లో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నాగుల సుధాకర్,ఉదయశ్రీ 20 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. వీరితో పాటు సుధాకర్ తల్లి బాలాజీనగర్‌లో నివసిస్తున్నారు.సుధాకర్ ప్రైవేట్ కంపెనీలో అటెండర్‌గా పనిచేస్తుండగా భార్య ఉదయశ్రీ ఇన్‌స్ట్రాగ్రామ్ లో రీల్స్ చేస్తు వస్తుంది. ఈ దశలో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తితో నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది. వీరిద్దరు వేరే కాపురం పెట్టుకునేందుకు ఆలోచిస్తున్న తరుణంలో ఉదయశ్రీ ఇంట్లో వాళ్లకు చెప్పి గురువారం బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది.ఈ విషయం తెలుసుకున్న కుమారుడు దొరబాబు తల్లిని బెడ్రూంలోకి తీసుకెళ్లి అక్రమ సంబంధం వద్దంటూ నచ్చచెప్పేందుకు యత్నించాడు. అయితే తల్లి ససేమిరా అనడంతో కోపంతో ఆమె గొంతు కోసి చంపి పారిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న సెంట్రల్ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి, సీఐ శ్యాం సుందర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

