7tv focus : భారత విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో టీ20 క్రికెట్లో ఏకంగా 10 సార్లు డకౌట్ అయిన తొలి ఆటగాడిగా నిలిచాడు. జపాన్‌తో జరిగిన చారిత్రక మ్యాచ్‌లో అభిషేక్ తొలి బంతికే ఔట్ అయి గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఏ ఆటగాడూ టీ20ల్లో పది డక్‌లు నమోదు చేయకపోవడం గమనార్హం.ఈ జాబితాలో అఫ్గానిస్థాన్ స్టార్ రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. 2019లో 56 టీ20 మ్యాచ్‌లు ఆడిన రషీద్.. తొమ్మిదిసార్లు డకౌటయ్యాడు. పాకిస్థాన్ ఆటగాడు షాదాబ్ ఖాన్ కూడా 2024లో తొమ్మిది డకౌట్లు నమోదు చేశాడు.
టీ20ల్లోనూ..
టీ20 అంతర్జాతీయ క్రికెట్లోనూ ఈ ఏడాది అభిషేక్ శర్మ డకౌట్ల పరంగా అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. పొట్టి ఫార్మాట్లో ఎక్కువసార్లు గోల్డెన్ డక్ అయిన భారత ఓపెనర్‌గా నిలిచాడు. 2026లో భారత్ తరఫున 27 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అతడు ఏడు సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పేరిట ఉన్న ఈ చెత్త రికార్డు అభిషేక్ ఖాతాలో పడింది. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో 4 సార్లు ఇలా ఔటయ్యాడు.

