7tv focus : జపాన్ ఆతిథ్యమిస్తున్న ఆసియా క్రీడల్లో భారత బృందం ఆకట్టుకుంటోంది. షూటర్ ఎలవెనిల్ రెండు వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో రజతంతో మెరవగా.. తెక్బాల్ కాంస్య పోరులో క్వింసీ డిసౌజాకు చుక్కెదురైంది. బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన భారత మహిళల జట్టు ఫైనల్ చేరింది. బ్యాడ్మింటన్‌లో సింధు సేన క్వార్టర్స్ ఆడనుంది. హాకీలో పురుషుల, మహిళల జట్లు భారీ విజయంతో రెండో రౌండ్లో అడుగుపెట్టాయి. టేబుల్ టెన్నిస్‌లో అమ్మాయిల టీమ్ ముందంజ వేయగా.. అబ్బాయిల బృందం ఓడిపోయింది.నగోయలోని మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో భారత్‌కు ఆదివారం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత, బృందం విభాగాల్లో ఎలవెనిల్ వలరివన్ వెండి వెలుగులు విరజిమ్మింది. అపై మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో సుచికా తరియల్సెమీస్ చేరిన పతకం ఖాయం చేసింది. అయితే.. తెక్బాల్లో సంచలన విజయాలతో ఆశలు రేపిన క్వింసీ డిసౌజా నిరాశపరిచింది. వ్యక్తిగత, మిశ్రమ విభాగాల కాంస్య పోరులో డిసౌజా ఓటమిపాలైంది. స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్లో రిషభ్ దాస్ ఆరో స్థానంలో నిలిచాడు.

