7tv focus : గణేశుల పండుగొచ్చింది.. ఏమైంది.. ఊరూరుకి ఏం నడుస్తుంది.. ఎక్కడ పోయినా ఏ పేరు వినబడుతోంది. దేఖ్ లేంగే అంటుర్రు.. కేసీఆర్ అంటున్నరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మూడేళ్లు పెద్ద మనిసి కనబడకపోయినా.. కేసీఆర్ బయటకు రా అని కాంగ్రెసోళ్లు అడుగుతా ఉంటరు కదా.. కేసీఆర్ ప్రజల గుండెల్లో భద్రంగా ఉన్నడు అనే మాట. మా పిల్లలే చెప్పారు. ఇవాళ రూ.2 వేలు పెన్షన్ అందుకుంటున్న 46 లక్షల మంది మా తల్లులు, మా పెద్ద మనుషులు కేసీఆర్కు రోజూ దీవెన పెడుతున్నరు. 200 రూపాయలుండే కొడుకా కేసీఆర్ రూ.2 వేలు చేసిండు. వీళ్లన్నీ లంగమాటలు చెప్పిర్రు.. ఏం చేయలేదు. ఇవాళ పాత రూ.2 వేలే వస్తున్నయని ప్రతీ తల్లి, పెద్ద మనిషి కేసీఆర్ను ఆశీర్వదిస్తున్నరు. అదేవిధంగా కేసీఆర్ ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లిచ్చిండు. ఆ నీటి బొట్టులో కేసీఆర్ రోజూ మా ఆడబిడ్డలకు కనబడుతున్నడు. మాకు బిందెలు, కుండలు తీసుకొని యుద్దాలు చేసే పరిస్థితి తప్పించిండు కేసీఆర్.. మా ఇంట్లోకి నీళ్లొస్తున్నయి.. నీటి బొట్టులో కేసీఆర్ ఉన్నడని మా ఆడబిడ్డలు రోజూ ఆశీర్వాదం ఇస్తున్నారని స్పష్టం చేశారు.
ఒక ఆడపల్లి పెళ్లి అయితే లక్ష రూపాయలు ఇస్తున్న ఒకేఒక్క నాయకుడు కేసీఆర్ అని వాళ్ల తల్లిదండ్రులు ప్రతీ రోజూ కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకున్నప్పుడల్లా కేసీఆర్ను ఒక మేనమామలాగా కేసీఆర్ యాది చేసుకుంటున్నరని కేటీఆర్ గుర్తు చేశారు. అట్లాగే బ్రహ్మాండంగా గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఎక్కడ డోర్నకల్, మహబూబాబాద్.. ఎక్కడ గోదావరి.. కాళేశ్వరం ద్వారా ఆ నీళ్లను తీసుకొచ్చి బ్రహ్మాండంగా కోదాడ, సూర్యాపేట దాకా అద్భుతంగా కేసీఆర్ నీళ్లించని ఎక్కడిక్కడ రైతులు యాది చేసుకుంటున్నరన్నారు.

