7tv focus : వాతావరణ శాఖ ఏపీకి తుఫాను గండం పొంచి ఉన్నట్లు వెల్లడించింది. బంగాళాఖాతంలో కొనసాగు తున్న అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారుతుందని.. ఆ తర్వాత అది తుఫాన్గా ఏర్పడే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలు లేక అల్లాడుతున్న రైతులకు ఓ పక్క ఇది మంచి విషయమే అయినప్పటికీ.. తుఫాను ముప్పు పైనా ఆందోళన కొన సాగుతోంది. అమెరికన్ మోడల్ వాతావరణ శాఖ ప్రకారం.. ప్రస్తుతం బంగాళాఖాతంలోని అల్పపీడనం సెప్టెంబర్ 22 నుంచి 25 మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారి, ఒడిశా లేదా పశ్చిమ బెంగాల్ తీరం వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అదే సమయంలో యూరోపియన్ మోడల్ వాతావరణ శాఖ మాత్రం ఇది తీవ్ర తుఫానుగా మారే ఛాన్స్ లేదని, కేవలం అల్పపీడనంగా మాత్రమే బలపడి భారీ వర్షాలు కురిపిస్తుందని స్పష్టం చేసింది.కడప సీటు అతనికి ఇవ్వండి.. కూటమి కీలక నేతకు సునీత సిఫారసు..!? వాతావరణ శాఖ తాజా అలర్ట్స్ అయితే భారత వాతవారణ శాఖ అంచనా భిన్నంగా కనిపిస్తోంది. ప్రస్తుతం థాయ్లాండ్ వైపు నుంచి వచ్చిన ఉపరితల ఆవర్తనం అండమాన్ సముద్రంలోకి ప్రవేశించి బలపడుతుందని పేర్కొంది. ఇది శనివారం నాటికి అల్పపీడనంగా మారి, క్రమంగా వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా – ఉత్తర ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే ఛాన్స్ ఉందని తెలిపింది. అయితే ఈ అల్పపీడనం తుఫానుగా మారుతుందా లేదా అనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉందని చెబుతోంది. నిపుణులు మాత్రం తుఫాను మారే అవకాశం ఉందని.. ఈ ప్రభావంతో రాబోయే రోజుల్లో తెలుగురాష్ట్రాలు సహా ఇతర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని.. వాయువ్య బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారే ఛాన్స్ ఉందని హెచ్చరిక చేసారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు.

