7tv focus : ఖమ్మం–నల్లగొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ ఓటును నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ ఎర్రుపాలెం మండల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం ఎర్రుపాలెంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో సమర్థవంతంగా వినిపించేందుకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమన్నారు. అర్హులైన పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.ఓటరు నమోదు కోసం ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్, పాస్పోర్టు సైజు ఫొటో, మొబైల్ నంబర్ అవసరమని తెలిపారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు వెంటనే నమోదు చేసుకోవడంతోపాటు, తమ పరిసరాల్లోని ఇతర పట్టభద్రులను కూడా ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ శీలం కవిత, మండల కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి, మండల నాయకులు గూడూరు రమణారెడ్డి, శేగిరెడ్డి శ్రీకాంత్రెడ్డి, కుడుముల మల్లికార్జునరెడ్డి, బొర్ర నరసింహారావు, సంక్రాంతి కృష్ణారావు, శ్రీపాలశెట్టి తిరుపతిరావు, గద్దల శ్రీనివాసరావు, సింహాద్రి వెంకటేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

