
బాచుపల్లి 7tv focus: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మైనారిటీ డిపార్ట్మెంట్ జనరల్ సెక్రటరీగా సయ్యద్ షఫీ గారు నియమితులయ్యారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారిని * సయ్యద్ షఫీ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం హన్మంతన్న సయ్యద్ షఫీ గారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు బుయ్యని శివ, కుత్బుల్లాపూర్ మైనారిటీ చైర్మన్ అబ్దుల్ గఫార్, వైస్ చైర్మన్ ఖైమ్ పాషా, డివిజన్ అధ్యక్షులు మైసిగారి శ్రీనివాస్, సిద్దనోళ్ల సంజీవ్ రెడ్డి, జలీల్ ఖాన్, డివిజన్ మైనారిటీ అధ్యక్షులు ఎం.డి. షకీల్, ఎం.డి. ఫెరోజ్, షేక్ షరీఫ్, ఎం.డి. జబ్బర్, ఎం.డి. యాసీమ్, ఖయీమ్, అఫాన్, గౌస్ భాయ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్యామ్, హన్మి రెడ్డి తదితర మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

