7tv focus : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు న్యాయస్థానంలో షాక్ తగిలింది. ట్రంప్ ప్రభుత్వం సీఎన్ఎన్, ఎమ్ఎస్ నౌ, పొలిటికో వార్తా సంస్థలను వైట్‌హౌస్‌లోకి ప్రవేశించడంపై విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. ఈ మూడు సంస్థలకు చెందిన జర్నలిస్టుల ప్రెస్ పాస్‌లను వెంటనే పునరుద్ధరించాలని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి టిమ్ కెల్లీ ఆదేశించారు. ఈ నిషేధం రాజ్యాంగ విరుద్ధమయ్యయ్యే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.ట్రంప్ ప్రభుత్వం ఈ నెల 18న సీఎన్ఎన్, ఎమ్ఎస్ నౌ, పొలిటికో మీడియా సంస్థలకు శ్వేతసౌధంలో ప్రవేశాన్ని నిరాకరిస్తూ నిషేధం విధించింది. తమపై రాస్తున్న కథనాలు వాస్తవికంగా లేవని, కల్పితాలుగా ఉన్నాయంటూ ట్రంప్ ఈ నిర్ణయాన్ని సమర్థించారు. దీనిని సవాల్ చేస్తూ సదరు మీడియా సంస్థలు ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. తమకు ఏమాత్రం ముందస్తు హెచ్చరికలు జారీచేయకుండా, కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా కల్పించకుండా ప్రెస్ పాస్‌లు రద్దు చేశారని తెలిపాయి. ఇది అమెరికా రాజ్యాంగంలోని భావ ప్రకటన స్వేచ్ఛ, స్వతంత్ర మీడియా హక్కులను కాలరాసినట్టవుతుందని పిటిషన్లో రాసుకొచ్చాయి.

