తెలంగాణ వ్యాప్తంగా 1.24 లక్షల వినాయక విగ్రహాలు
7tv focus : తెలంగాణలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ కీలక వివరాలను వెల్లడించారు. ఐసీసీసీ, డీజీపీ కార్యాలయం నుంచి నిమజ్జన ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా జియో ట్యాగింగ్, సంబంధిత పోర్టల్లో నమోదైన సమాచారం ఆధారంగా 1,24,000 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు గుర్తించామని చెప్పారు. ఇవన్నీ పబ్లిక్ ప్లేస్లలో ఏర్పాటు చేసిన విగ్రహాల వివరాలు మాత్రమేనని స్పష్టం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సుమారు 8 వేల విగ్రహాలు అదనంగా ఏర్పాటు అయ్యాయని డీజీపీ తెలిపారు. గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు 88 వేల విగ్రహాలు నిమజ్జనం పూర్తయినట్లు వెల్లడించారు. ఒక్కరోజులోనే 6,350 విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads