7tv focus : కేరళంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, బురద ప్రవాహాలు, ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందగా.. పలువురు గల్లంతయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. భారీ వర్షాలకు మలప్పురం జిల్లాలోని కొట్టపుళ నదికి వరదనీరు పోటెత్తింది. అయితే, ఆదివారం సాయంత్రం వాందూర్కు చెందిన ఐదుగురు స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. ఒక్కసారిగా ఆకస్మిక వరద రావడంతో ఐదుగురూ కొట్టుకుపోయారు.

