7tv focus : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఇవాళ (మంగళవారం) పాఠశాల విద్యార్థుల కోసం విస్తరించిన అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. చెన్నైలోని గాంధీ గ్రామం ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో ఈ పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీఎం విజయ్ స్వయంగా అల్పాహారం వడ్డించారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఆ తర్వాత తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.కాగా, గత ప్రభుత్వం అమలు చేసిన ముఖ్యమంత్రి అల్పాహార పథకంలో టీవీకే ప్రభుత్వం పలు మార్పులు చేసింది. ఈ పథకానికి పెరుంతలైవర్ కామరాజర్ ఉచిత అల్పాహార పథకంగా పేరు మార్చింది. ఇప్పటివరకు 5వ తరగతి వరకు అమలైన ఈ పథకాన్ని తాజాగా 8వ తరగతి వరకు విస్తరించింది. ఈ మేరకు విస్తరించిన పథకాన్ని సీఎం విజయ్ నేడు ప్రారంభించారు. ఈ విస్తరణతో అదనంగా సుమారు 15.30 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15,454 ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

