7tv focus : కృష్ణా జలాలను తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయాలని కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అందుకు కర్ణాటక సీఎం శివకుమార్ సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రతిస్పందించారు. తెలంగాణ ప్రజల తరఫున కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.కృష్ణా జలాలను తెలంగాణకు విడుదల చేయాలన్న తన విజ్ఞప్తిని అంగీకరించినందుకు ఆయనకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య స్నేహభావానికి ఇదొక గొప్ప ఉదాహరణ అని చెప్పారు. కర్ణాటక, తెలంగాణ ప్రజల మధ్య ఉన్న సోదర భావానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. దేశ ప్రజల మధ్య ప్రేమ, సోదరభావాన్ని చాటేలా కృష్ణా జలాల విడుదల నిర్ణయం తీసుకున్నారంటూ కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం రేవంత్ స్పందించారు.

