7tv focus : ఓ ఆటో డ్రైవర్, ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్నారు. ఈ ఘటన బెంగుళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ థార్డ్ సెక్టార్లో జరిగింది. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆటోడ్రైవర్, ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటున్నా.. వారిని ఎవరూ ఆపలేకపోయారు. చివరకు ఓ అమ్మాయి వచ్చి ఆ గొడవను ఆపింది. ఇన్స్టాగ్రామ్తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో వీడియో వైరల్ అవుతోంది. ఆటోడ్రైవర్పై చర్యలు తీసుకోవాలని నెటిజెన్లు డిమాండ్ చేశారు.వీడియోను చూసిన తర్వాత హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పోలీసులు ఆ అమ్మాయిలతో కాంటాక్ట్ అయ్యారు. ఫిర్యాదు చేయాలని కోరారు. కానీ ఆ అమ్మాయిలు మరో రెండు రోజుల సమయం అడిగినట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు. ఆటో డ్రైవర్ను కూడా పోలీసులు ట్రేస్ చేశారు. తన ఆటోను హైర్ చేసిన ఆ అమ్మాయిలు.. పేమెంట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు చెప్పాడు. మద్యం మత్తులో ఉన్న అమ్మాయిలు పేమెంట్ ఇవ్వలేదన్నాడు. ఫిర్యాదు నమోదు అయిన తర్వాత చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

