10 నెలలుగా పెద్దపులి సంచారం.. భయాందోళనలో పోలవరం ఏజెన్సీ వాసులు
7tv focus : జిల్లాలోని దేవీపట్నం మండలం ఇందుకూరు రేంజ్లో పెద్దపులి సచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 10 నెలలుగా పెద్దపులి సంచారం కొనసాగుతోంది. నెలకోట-రామదుర్గం మార్గంలోని పోలవరం ప్రాజెక్టు టన్నెల్ వద్ద పులి కదలికలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో రామదుర్గం కొండపైకి భక్తులు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. పూడిపల్లి, గొందూరు, పోచమ్మ గండి, రామదుర్గం, నెలకోట, చిన్నారిగండి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గతంలో ఇందుకూరు రేంజ్లో అడవి పంది పిల్లను పెద్దపులి చంపేసింది. ఫోక్స్పేట రేంజ్లో 6 పశువులపై దాడుల తర్వాత ఇందుకూరు రేంజ్లోకి ప్రవేశించింది. పులి సంచారంతో గిరిజన గ్రామాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రివేళల్లో ఒంటరిగా బయటకు...
⏱ Top Story
👁 3 Views |
⬇️ 0 Downloads