konaipalli-ration-cards_V_jpg--816x480-3g
Avatar
7TV Focus News

 స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చారు.. ఊరి పేరు మార్చేశారు..

7tv focus : దౌల్తాబాద్, సెప్టెంబర్ 26: కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు తప్పుల తడకగా మారాయి. కార్డుల్లో ఏకంగా గ్రామం పేరే తప్పుగా ముద్రించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టగా.. పలువురు కార్డుల్లో కోనాయిపల్లికి బదులు కోనాపూర్ అని నమోదైంది.ప్రభుత్వ పథకాలకు కీలకమైన రేషన్‌ కార్డుల్లో గ్రామం పేరు తప్పుగా ఉండటంపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్డుల ముద్రణ, పంపిణీకి ముందే లబ్ధిదారుల వివరాలను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉండగా.. కనీసం గ్రామం పేరు కూడా సరిగ్గా లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తప్పులున్న రేషన్‌ కార్డులను ఉపయోగించే సమయంలో భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని లబ్ధిదారులు...
⏱ Top Story 👁 2 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article