Varshitha_V_jpg--816x480-3g
Avatar
7TV Focus News

సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారిణి వర్షితకు రూ.10,500 ఆర్థిక సాయం

7tv focus : జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికైన పోతిరెడ్డి వర్షితకు ఆర్థిక ఇబ్బందులపై నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి స్పందనగా దాత‌లు రూ.10,500 ఆర్థిక సహాయం అందించారు. రామవరం మాతా శిశు ఆస్పత్రి డాక్టర్‌ మామిడాల సుజాత రూ.5,000, జడ్పీహెచ్‌ఎస్‌ 1995-96 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు రూ.3,500, పాఠశాల ఉపాధ్యాయులు రూ.2,000 కలిపి మొత్తం రూ.10,500ను వర్షితకు అందజేశారు. మహారాష్ట్రలో ఈ నెల 27 నుండి 30 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వర్షితకు చేయూతనందించిన దాతలకు, బిజెపి నాయకుడు సొప్పరి క్రాంతికి, క్రీడాకారిణి వర్షిత, కోచ్‌ పొన్నాల పృథ్వీరాజ్‌ కృతజ్ఞతలు తెలిపారు. వర్షితకు ఆర్థిక సహాయం అందేలా కథనాన్ని ప్రచురించిన నమస్తే తెలంగాణకు కూడా...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article