images (1)
Avatar
7TV Focus News

 సందీప్ రెడ్డి వంగా ‘రోమాంచ‌కం’ నెట్‌ఫిక్స్‌లో..

7tv focus : యువతను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘రోమాంచ‌కం’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయినప్పటికీ.. ఇప్పుడు డిజిటల్ వేదికపై కొత్త ప్రేక్షకులను అల‌రించేందుకు సిద్ధ‌మైంది.. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ ఈ సినిమాలో ప్రధాన జంటగా నటించారు. యువతకు సంబంధించిన ప్రేమ, వినోదం, సంబంధాల చుట్టూ సాగే కథాంశంతో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తాజాగా ‘రోమాంచ‌కం’ ఓటీటీ విడుదల తేదీని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 1, 2026 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది....
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article