deer-meat-shadnagar_V_jpg--816x480-3g
Avatar
7TV Focus News

షాద్‌నగర్‌లో జింక మాంసం పట్టివేత..

7tv focus : జింకను వేటాడి మాంసాన్ని తరలిస్తున్న ఎనిమిది మందిని ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. షాద్‌నగర్‌ టోల్‌ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు కార్లను పోలీసులు తనిఖీ చేయగా జింక మాంసం బయటపడింది.వాహనాల్లో మొత్తం 13 కిలోల జింక మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జింకను వేటాడేందుకు ఉపయోగించిన రైఫిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మాంసాన్ని తరలిస్తున్న రెండు కార్లను సీజ్‌ చేశారు.
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article