శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నాట్య నివేదన..
7tv focus : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్న వేళ సింగపూర్కు చెందిన కూచిపూడి నృత్య కళాకారులు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నాట్య నివేదన సమర్పించేందుకు తిరుమలకు విచ్చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సౌజన్యంతో శ్రీ సాంస్కృతిక కళాసారథి–సింగపూర్ (SSKS) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనుంది. సింగపూర్కు చెందిన అభినయ నాట్యాలయ – ప్రత్యూష అవధానుల శిష్యబృందం, మాతృశ్రీ సాయి అకాడమీ – నిషిత యాబాజీ శిష్య బృందంకు చెందిన 22 మంది కూచిపూడి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గురువులతో కలిపి సుమారు 45 మంది ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు.శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడసేవ సందర్భంగా.. తిరుమల మాడవీధుల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సింగపూర్ బృందం కూచిపూడి...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads