vemulawada-thief_V_jpg--816x480-3g
Avatar
7TV Focus News

వినాయకుడి మెడలో నోట్ల దండ ఎత్తుకెళ్లేందుకు యత్నించిన యువకుడు..

 వేములవాడ 7tv focus : వినాయకుడి వద్ద అలంకరించిన భారీ నోట్ల దండను అపహరించేందుకు ఓ వ్యక్తి చేసిన ప్రయత్నాన్ని యువకులు అడ్డుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటుచేసుకుంది. బద్దిపోచమ్మ వీధిలోని వినాయకుడి విగ్రహం వద్ద ఈ ఘటన జరిగింది.జీవైసీ యూత్‌ ఆధ్వర్యంలో వినాయకుడికి 500 రూపాయల నోట్లతో రూ.50 వేల విలువైన దండను అలంకరించారు. తెల్లవారుజామున అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి నోట్ల దండను గమనించి దానిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన యూత్‌ సభ్యులు వెంటనే అప్రమత్తమై అతడిని వెంబడించారు. కొంతదూరం వెళ్లిన తర్వాత ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నోట్ల దండను కూడా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ఘటనపై...
⏱ Top Story 👁 10 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article