వినయ్ భాస్కర్‌పై దాడి ఘటన.. మెడికో-లీగల్ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేయాలి
7tv focus : మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్‌పై జరిగినట్లు పేర్కొంటున్న దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ పోలీసులను కోరారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.దాస్యం వినయ్ భాస్కర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్యుల నివేదికతో పాటు మెడికో-లీగల్ నివేదికను పరిగణనలోకి తీసుకుని, చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని వినోద్ కుమార్ కోరారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, ప్రత్యక్ష సాక్షులు, అందుబాటులో ఉన్న వీడియోలు, ఇతర ఆధారాలను పరిశీలించి బాధ్యులను గుర్తించాలని ఆయన సూచించారు.ఈ విషయంపై...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads