muvva-ramarao_V_jpg--816x480-4g
Avatar
7TV Focus News

విద్యార్థులు జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

7tv focus : విద్యార్థులు జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకుడు డాక్టర్ మువ్వా రామారావు అన్నారు. సోమవారం నిడమనూరు మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ గురుకుల కళాశాలలో జీవన నైపుణ్యాలు- రాజ్యాంగం శాస్త్రీయ దృక్పథం అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మువ్వా రామారావు మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, ప్రశ్న ద్వారానే సమాజం మార్పు చెందుతుందన్నారు. తదనంతరం గ్రంథాలయ ఉద్యమ నాయకుడు కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా పుస్తకాలు చదవడం ద్వారా అనంతమైన విజ్ఞానాన్ని పొందవచ్చు అని తెలిపారు. ఎవరైతే ఇష్టపడి చదువుతారో జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారన్నారు. జన విజ్ఞాన వేదిక...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article