విద్యార్థులతో కలిసి ప్రియాంకాగాంధీ డ్యాన్స్..
7tv focus : కాంగ్రెస్ నాయకురాలు , వాయనాడ్ ఎంపీప్రియాంకాగాంధీ వాద్రా ఎక్కడ పర్యటించినా అక్కడి జనంతో సరదాగా గడుపుతారు. తనను ఆహ్వానిస్తూ వాళ్లు చేసే సాంస్కృతి కార్యక్రమాల్లో తను కూడా లీనమైపోతారు. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. ఇవాళ కేరళంలోని తన సొంత నియోజకవర్గం వాయనాడ్లో పర్యటించిన ప్రియాంకాగాంధీ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు.కల్లూర్లోని రాజీవ్గాంధీ మెమోరియల్ హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థులతో సరదా ముచ్చటించారు. వారి విద్యాభ్యాసం, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి నృత్యం చేశారు. ప్రియాంకాగాంధీ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కింది వీడియోలో...
⏱ Top Story
👁 12 Views |
⬇️ 0 Downloads