images
Avatar
7TV Focus News

బాక్సాఫీస్ వద్ద ‘ది ప్యారడైజ్’ విధ్వంసం.. తొలి రోజే రూ. 88 కోట్లు!

7tv focus : నేచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలదర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజు నుంచి అన్ని కేంద్రాల నుంచి బ్లాక్‌బస్టర్ టాక్ లభిస్తోంది.ఈ సినిమా విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ‘ది ప్యారడైజ్’ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 88 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ‘జడల్ జమానా’ అంటూ మేకర్స్ ముందే ఇచ్చిన హైప్‌కు తగ్గట్టుగానే సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article