nori-lakshmi-bhaskar_V_jpg--816x480-3g
Avatar
7TV Focus News

నిమ్స్‌ అడిషనల్ సూపరింటెండెంట్‌ నివాసంపై ఏసీబీ సోదాలు..

 7tv focus : నిమ్స్‌ అడిషనల్ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీభాస్కర్‌పై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై మంగళవారం ఉదయం ఏకకాలంలో ఈ తనిఖీలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌తో పాటు మూడు జిల్లాల్లో మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు సోదాలు చేపట్టాయి.లక్ష్మీభాస్కర్‌కు సంబంధించిన నివాసాలు, కార్యాలయాలు, ఇతర అనుబంధ ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎర్రగడ్డలోని ఆయనకు చెందిన కల్పతరువు అపార్ట్‌మెంట్స్‌తో పాటు కుటుంబసభ్యులకు సంబంధించిన ప్రాంతాల్లోనూ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, డిపాజిట్లు తదితర వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article