images (10)
Avatar
7TV Focus News

నదిలో మునిగి ఐదుగురు మృతి..మృతుల్లో ముగ్గురు మైనర్లు

 7tv focus : ఝార్ఖండ్‌లోని పాలము జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివాసీ సంప్రదాయ వేడుకల్లో భాగంగా పూజించిన చెట్టుకొమ్మను లో నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఐదుగురు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు.పూజా కార్యక్రమం అనంతరం చెట్టుకొమ్మను నదిలో నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. నదిలోకి దిగిన ఐదుగురు ప్రవాహంలో కొట్టుకుపోయి కనిపించకుండా పోయారు.సమాచారం అందుకున్న స్థానిక జాలర్లు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. తీవ్రంగా శ్రమించిన అనంతరం ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article