నందిగామలో రూ.4 కోట్ల కరెన్సీతో కొలువుదీరిన గణనాథుడు..
7tv focus : జిల్లాలోని నందిగామలోని వాసవి మార్కెట్లో ఏర్పాటు చేసిన కరెన్సీ గణనాథుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వినాయకుడిని ఏకంగా రూ.4 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. 44 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్న కమిటీ.. ప్రతి ఏడాదీ వినూత్నంగా అలంకరణలు చేస్తూ భక్తులను ఆకట్టుకుంటోంది. గతేడాది సైతం రూ.3.33 కోట్ల విలువైన కరెన్సీతో వినాయకుడిని అలంకరించగా, ఈసారి ఆ మొత్తాన్ని మరింత పెంచి రూ.4 కోట్లకు చేర్చింది. దీంతో ఈ కరెన్సీ గణనాథుడిని చూసేందుకు నందిగామతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.ఈ ప్రత్యేక...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads