దేవని సతీష్ మాదిగకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి
30 ఏళ్ల సామాజిక ఉద్యమ సేవలను గుర్తించాలి: సామాజిక ఉద్యమ నాయకులు చిన్నోళ్ల అనంతయ్య షాద్ నగర్ . తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో గవర్నర్ కోటాలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన దేవని సతీష్ మాదిగకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని సామాజిక ఉద్యమ నాయకులు చిన్నోళ్ల అనంతయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ఉద్యమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ సుమారు 30 సంవత్సరాలుగా సామాజిక న్యాయం కోసం ఉద్యమాలు నిర్వహించిన సతీష్ మాదిగకు ప్రత్యేక గుర్తింపు ఉందని అనంతయ్య పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా ప్రత్యేక కార్యాచరణతో ఉద్యమాలు నిర్వహించి, రాష్ట్ర ఏర్పాటు వరకు పోరాటం చేశారని...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads