ది ప్యారడైజ్’కు నైజాంలో భారీ వసూళ్లు..
7tv focus : నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాకు మిశ్రమ స్పందన లభించింది. ముఖ్యంగా సినిమా కథనం, నిడివి, కొన్ని సన్నివేశాలపై ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ ఈ ప్రభావం వసూళ్లపై పూర్తిగా పడలేదని బాక్సాఫీస్ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ఈ సినిమా చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించింది. సుమారు రూ.27.5 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఆదివారం ఒక్కరోజే ఈ ప్రాంతంలో దాదాపు రూ.4.7 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ లెక్కలు...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads