దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై బుధవారం సుప్రీంలో విచారణ
7tv focus : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ హైకోర్టు తనపై విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై దానం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. ఈ పిటిషన్ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం బుధవారం(సెప్టెంబర్ 23) విచారణ జరపనుంది. తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ దానం నాగేందర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.ఇటీవల దానం నాగేందర్ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా తెలంగాణ హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి గెలిచిన...
⏱ Top Story
👁 3 Views |
⬇️ 0 Downloads