తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు..
7tv focus : ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పోలవరం సహా పలు జిల్లాల్లో విపరీతంగా వానలు పడుతున్నాయి. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులకు పెద్దఎత్తున వరదనీరు పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బస్సులు, రైళ్లు, విమాన సర్వీసులు ఆలస్యమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.భారీ వర్షాల కారణంగా రాజమహేంద్రవరం విమానాశ్రయంలో పలు విమాన సర్వీసుల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఈరోజు (గురువారం) హైదరాబాద్ నుంచి స్థానిక ఎయిర్పోర్టుకు రావాల్సిన విమానం ఆలస్యమైంది. మధ్యాహ్నం ఒంటి గంటకు రావాల్సిన FLY-91 విమాన సర్వీసు గంట ఆలస్యమైంది. అదే సంస్థకు...
⏱ Top Story
👁 10 Views |
⬇️ 0 Downloads