mancherial_V_jpg--816x480-3g
Avatar
7TV Focus News

తల్లికి వైద్యం అందలేదని.. వీల్‌చైర్‌లో ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లిన కొడుకు

మంచిర్యాల7tv focus : ప్రభుత్వ ఆస్పత్రిలో తన తల్లికి సరైన వైద్యం అందడం లేదని ఆరోపిస్తూ ఓ కుమారుడు చేసిన పని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి ఆస్పత్రి నుంచి తల్లిని వీల్‌చైర్‌లో కూర్చోబెట్టుకుని సుమారు 2 కిలోమీటర్లు తోసుకుంటూ ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది.మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పులిమడుగుకు చెందిన భూక్యా బుజ్జి (55) కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నది. మంగళవారం అర్ధరాత్రి ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో కుమారుడు భూక్యా రాజ్‌కుమార్ ఆమెను మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి కావడంతో ఆస్పత్రిలో సిబ్బంది అందుబాటులో లేకపోయారని రాజ్‌కుమార్ ఆరోపించాడు. తన తల్లి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నా వైద్యం చేయాలని ఎంత వేడుకున్నా...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article