తమ్ముడి పెళ్లికి వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం.. అన్న సహా ముగ్గురు దుర్మరణం..
7tv focus : తమ్ముడి పెళ్లి కోసం భార్య, స్నేహితులతో స్వగ్రామానికి వెళ్లిన వ్యక్తిని తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. అతడితోపాటు అతని ఇద్దరు స్నేహితులు కూడా ప్రాణాలు కోల్పోయారు. భార్య మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడురాష్ట్రం పెరంబలూర్ జిల్లా లోని తురాయ్మంగళం గ్రామానికి సమీపంలో తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారి పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. రామనాథపురం జిల్లా ముడుకులతూర్ తాలూకా ఒరియవాయల్ గ్రామానికి చెందిన కార్తి (38) చెన్నైలో భార్య సూర్యతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల తన తమ్ముడి వివాహం కోసం భార్య, స్నేహితులతో కలిసి కారులో స్వగ్రామానికి వచ్చాడు. వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం గురువారం తెల్లవారుజామున భార్య, స్నేహితులతో...
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads