gadwal-accident_V_jpg--816x480-4g
Avatar
7TV Focus News

గద్వాలలో బోల్తాపడిన ట్రావెల్స్‌ బస్సు.. 

7tv focus : జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. మానవపాడు మండలం బోరవెల్లి స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున తమిళనాడుకు చెందిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే వారంతా స్వల్ప గాయాలతో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.తమిళనాడులోని సేలం హోలీక్రాస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థులు హైదరాబాద్‌ వండర్లాకు విహారయాత్ర కోసం బస్సులో బయలుదేరారు. బోరవెల్లి వద్ద బస్సు వేగంగా వెళ్తుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెద్ద ప్రమాదం తప్పడంతో విద్యార్థులు, వారి వెంట ఉన్నవారు ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం అలంపూర్‌...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article