AP-Cabinet_V_jpg--816x480-4g
Avatar
7TV Focus News

కొత్తగా నాలుగు పోలీస్‌ కమిషనర్లేట్ల ఏర్పాటుకు ఆమోదం

7tv focus : ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశం బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 60కి పైగా అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఏపీలో నాలుగు ప్రాంతాల్లో కొత్త పోలీసు కమిషనరేట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాలుగా పోలీసు కమిషనరేట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమరావతి గ్రామాల్లో మౌలిక వసతుల పనులకు రూ.1,548.98 కోట్లతో అనుమతిచ్చింది. అమరవాతి ఇన్‌ఫ్రా పనులకు అదనంగా మరో రూ.644.98 కోట్లను కేటాయించింది. అసెంబ్లీ భవన స్పెర్‌, రూఫ్‌, లిఫ్టుల పనులకు రూ.661 కోట్లు, దాచేపల్లిలో మైహోమ్‌ ఇండస్ట్రీస్‌ గ్రీన్‌ఫీల్డ్‌ సిమెంట్‌ యూనిట్‌కు ప్రోత్సాహకాలు,శ్రీసిటీలో క్యాటర్‌పిల్లర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఫెసిలిటీకి ఆమోదం తెలిపింది.
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article