ఐసీసీ ట్రోఫీ గెలవాలంటే భారత్ను ఓడించాల్సిందే
7tv focus : వెస్టిండీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇక్కడ మూడు వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఆదివారం భారత్తో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టోర్నీలు గెలవాలంటే బలమైన భారత్ను ఓడించడం తప్పనిసరి అని అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో టీమిండియాను ఎదుర్కోవడం తమ సత్తాను పరీక్షించుకునేందుకు గొప్ప అవకాశమని వెల్లడించాడు. భారత్లో విండీస్ వన్డే సిరీస్ గెలిచి దాదాపు 24 ఏళ్లు గడిచాయని డారెన్ సామీ గుర్తు చేశాడు. ‘భారత్లో సిరీస్ గెలిచి 24 ఏళ్లు అవుతోంది. కాబట్టి ఈసారి సిరీస్ గెలిచేందుకు మాకు ఇది గొప్ప అవకాశం. వన్డేల్లో ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవడానికి, మనల్ని...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads