ఏపీ హైకోర్టులో ఐదుగురు జడ్జిలకు శాశ్వత హోదా..
7tv focus : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురికి శాశ్వత హోదా కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుకు కేంద్రం బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో ఏపీ హైకోర్టులో జస్టిస్ మహేశ్వరరావు కుంచం, జస్టిస్ తోట చంద్ర ధన శేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరిహరనాధ శర్మ, జస్టిస్ యడవల్లి లక్ష్మణరావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించింది.ఈ రోజు జరిగిన కొలీజియం సమావేశంలో ఈ సిఫార్సుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వరకు ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేసిన వీరంతా.. ఇకపై శాశ్వత న్యాయమూర్తులుగా విధులు నిర్వహించనున్నారు. 2024, అక్టోబర్ 28వ తేదీన జస్టిస్ మహేశ్వరరావు కుంచం, జస్టిస్ తోట చంద్రధనశేఖర్,...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads