ఏపీలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు..!
7tv focus : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రాబోయే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం మంగళవారానికి వాయుగుండంగా బలపడనుందని, దీని ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడతాయని స్పష్టంచేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం.. మంగళవారం (సెప్టెంబర్ 22) నుంచి రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరగనుంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు పోలవరం, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది....
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads