toma_b7af31c558
Avatar
7TV Focus News

ఎండిపోతున్న టమాట తోట

7tv focus : ఎలినినో ప్రభావంతో టమాట తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన టమాట తోట కళ్ల ముందే ఎండిపోతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో 250 ఎకరాల్లో టమాట తోటలు ఎండిపోయాయని రైతులు లాలునాయక్‌, మహేందర్‌, మల్లేష్‏యాదవ్‌, వెంకటరెడ్డి వాపోతున్నారు. టమాటకు ధర ఉన్నా చిన్న సైజులో కాయ ఎర్రగా మారి ఎండిపోతుందని వాపోతున్నారు. టమాట సాగుతో రూ.లక్ష వరకు ఆదాయం వస్తుందని ఆశించామని, తీరా రూ.రెండు లక్షల దాక అప్పులే మిగిలాయని రైతు లాలు నాయక్‌ కన్నీటిపర్యంతమయ్యారు.
⏱ Top Story 👁 10 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article