ఉద్యమకారుడికి అండగా.. మాట నిలబెట్టుకున్న కేటీఆర్..
7tv focus : కూకట్పల్లి షంషీగూడకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ ముదిరాజ్ (51) అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్తో బాధపడుతున్న విషయం మాజీ కార్పొరేషన్ చైర్మన్ పాటిమీది జగన్ మోహన్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.తెలంగాణ ఉద్యమ సమయంలో చిన్న వయసు నుంచే తెలంగాణ తల్లి వేషధారణలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న లక్ష్మణ్ కుమార్తె చంద్రికతోపాటు కుటుంబ సభ్యులతో ఇటీవల కేటీఆర్ ఫోన్లో మాట్లాడి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ భవన్లో లక్ష్మణ్ కుమార్తె, కుమారుడు కేటీఆర్ను కలిశారు. ఇప్పటికే బసవతారకం ఆసుపత్రిలో రెండు కీమోథెరపీలు పూర్తయ్యాయని తెలుసుకున్న కేటీఆర్ , తదుపరి చికిత్స గురించి ఆరా తీశారు
⏱ Top Story
👁 11 Views |
⬇️ 0 Downloads