ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి
7tv focus : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు సూచించారు. గాలులు, వర్షాల వల్ల విద్యుత్ స్తంభాలు కూలినా లేదా ఇతర విద్యుత్ సమస్యలు తలెత్తినా తక్షణమే స్పందించేలా APEPDCL సిబ్బందిని సిద్ధం చేశామని ఆయన తెలిపారు. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే 1912 టోల్ ఫ్రీ నంబర్కు లేదా కంట్రోల్ రూమ్లకు సమాచారం అందించాలని చెప్పారు. అలాగే కూలిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన వైర్ల దగ్గరకు ఎవరూ వెళ్లవద్దని మంత్రి అచ్చం నాయుడు కోరారు. ప్రభుత్వం అన్ని వేళలా ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads